బాలికను వేధించినందుకు రెండేండ్ల జైలు

Tue,April 2, 2019 05:45 AM

Two years imprisonment for girl harassment case

హైదరాబాద్ : మైనర్ బాలికను వేధించిన ఘటనలో ఓ వ్యక్తికి రెండేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కొంతం స్వామి ఓ మైనర్ బాలికకు ఫోన్ చేసి ప్రేమను ప్రతిపాదించాడు. ఫోన్ చేసిన వ్యక్తిని ప్రత్యక్షంగా చూసిన బాలిక వయస్సులో చాలా తేడా ఉండడంతో అతని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ చర్యకు కోపాన్ని పెంచుకుని బాలికను వేధించడంతో పాటు తల్లిని చంపుతానని బెదిరించాడు. ఈ ఫిర్యాదుపై మల్కాజిగిరి పోలీసులు కొంతం స్వామి బెదిరింపులు, వేధింపులకు సంబంధించి పూర్తి ఆధారాలను ఎల్బీనగర్ కోర్టు ముందు ఉంచారు. పరిశీలించిన కోర్టు కొంతం స్వామిని దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles