మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు: కేసీఆర్

Sat,February 23, 2019 01:54 PM

హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఓటాన్ అకంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నిన్న కేటాయించిన ఎమ్మెల్సీ సీట్లలో కూడా కూడా ఓ మహిళకు స్థానం కల్పించినట్లు తెలిపారు. మంత్రివర్గం విస్తరణ పరిధి మనకున్నది 17. రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని తీసుకోనేది ఉంది. దాంట్లో ఇద్దరి మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.


మహిళా సంఘాలు నడిపేటటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నవని చెప్పారు. వాటికి ఇబ్బందులు కలుగనీయకుండా చూస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పి వాటిని మహిళా సంఘాలకే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలను రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయమని.. మహిళల పట్ల గౌరవం ఉందని పేర్కొన్నారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని.. లేకపోతే తాము అధికారంలోకి రాలేమన్నారు.

7708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles