రేపటి నుంచి ఇఫ్లూలో రెండు వారాల ఇంగ్లిష్ కోర్సు

Wed,June 19, 2019 06:41 AM

Two week English course in EFLU from tomorrow

హైదరాబాద్ : ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) దూరవిద్యా విధానంలో ఇంగ్లిష్ కోర్సును రెండు వారాల పాటు నిర్వహిస్త్తుంది. ఈనెల 20వ తేదీ నుంచి జూలై 5 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు తరగతులను నిర్వహించనున్నారు. కోర్సులో వినడం, చదవడం, రాయడం, మాట్లాడడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. ఇందులో చేరేందుకు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కోర్సు అడ్మిషన్ తీసుకునేందుకు అప్లికేషన్ ఫీజు రూ.30 తో పాటు కోర్సు ఫీజు రూ.500 చెల్లించాలి. సీట్ల కేటాయింపులో ముందు గా వచ్చినవారికి ప్రాధానత్యనిస్తారు. పూర్తి వివరాలకు 040-27689 431/ 27689597 నంబర్లలో సంప్రదించవచ్చు.

1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles