కృష్ణా ట్రిబ్యునల్‌లో రెండో రోజు ముగిసిన వాదనలు

Fri,February 23, 2018 06:27 PM

Two states arguments for second day are over in krishna tribunal

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌లో రెండో రోజు జరిగిన ఇరు రాష్ర్టాల వాదనలు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు ట్రిబ్యునల్‌కు హాజరయ్యారు. వాదనల అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాటాపై ప్రభుత్వ తరుపు న్యాయవాదులు ట్రిబ్యునల్‌లో సరైన వాదనలను వినిపిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అవసరాలపై ఎంత కొట్లాడినా సరైన వాటా దక్కలేదన్నారు. తెలంగాణ వాటా తెలంగాణ ప్రాంతానికి దక్కాలన్నదే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని... ప్రస్తుతం తెలంగాణకు 299, ఆంధ్రాకు 511 వాటా ఉందన్నారు.

తమకు మరింత వాటా పెరగాలన్న హరీశ్ రావు.. కోర్టులు, ట్రిబ్యునల్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తమకు రావాల్సిన వాటాపై న్యాయబద్ధంగా, నిబంధనల ప్రకారం కొట్లాడుతున్నామన్నారు. అంతర్జాతీయ నీటి పంపకాలను అనుసరించే తమ వాదన కొనసాగుతున్నదన్నారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర అవసరాలు, నీటి కేటాయింపులపై తమ న్యాయవాదులు చక్కని ప్రజెంటేషన్, క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారన్నారు. నీటి వాటాల కేటాయింపుపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అంతర్జాతీయ నీటి చట్టాలను అనుసరించి కోర్టులను ఆశ్రయిస్తే కేంద్రం ఏడాదిలోపు తన వైఖరిని తెలపాలన్నారు. కానీ, ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా కేంద్రం తన వైఖరి చెప్పలేదని.. ట్రిబ్యునల్‌కు తగిన సూచనలు చేయడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles