
నల్లగొండ: జిల్లాలోని కనగల్ మండలం తిమ్మనగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తిమ్మనగూడెం స్టేజీ వద్ద నిలిచిఉన్న బస్సును మరో బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.