భూపాల‌ప‌ల్లి జిల్లాలో వడదెబ్బతో ఇద్ద‌రు మృతి

Thu,April 26, 2018 08:10 PM

two persons died with sun stroke in jayashankar bhupalapally dist

జయశంకర్‌ భూపాలపల్లి: వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం వెంకట్రావ్‌పల్లి చివారు జోడుపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం..జోడుపల్లికి చెందిన కందుల రాజేష్(47) రోజు లాగే పొలం వద్దకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఎండ తీవ్రతకు కళ్లు తిరుగుతున్నాయని, గొంతు తడి ఆరిపోతుందని అతడి భార్య కవితకు తెలుపడంతో వెంటనే స్థానికుల సహయంతో రాజేష్‌ను చిట్యాల సామాజిక దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో టేకుమట్ల దగ్గర మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు రామకృష్ణ, దిలీప్ ఉన్నారు.

వృద్ధుడు మృతి


జిల్లాలోని చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడెల రాజీరు(78) అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇటీవల వడగాలుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles