డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతి

Sun,July 21, 2019 09:24 PM

two persons died in accident at bhiknoor toll plaza

భిక్కనూరు : అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44 జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్(37), స్వామి (30)లు వీరు ఇద్దరు వరుసకు బావబావమరుదులు. వీరు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బంధువుల ఇంటిలో శుభకార్యం ఉండడంతో హైదరాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా స్వామి వెనక కూర్చున్నాడు. 3 గంటల సమయంలో బైక్ టోల్‌ప్లాజా వద్ద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజా బూత్‌ను తగిలింది. దీంతో ఇద్దరు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని టోల్ ప్లాజా సిబ్బంది 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలించారు. దవాఖానలో శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వామి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles