కారు బైక్ ఢీ:ఇద్దరు వ్యక్తుల మృతి

Tue,December 3, 2019 09:15 PM

అచ్చంపేట : కారు బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఉప్పునుంతల మండల పరిధిలోని ఈరట్వానిపల్లి నుంచి జక్కుల సత్తయ్య (55), బల్మూర్ మండల కేంద్రానికి చెందిన కొట్టె నిరంజన్ (50) ద్విచక్ర వాహనంపై అచ్చంపేట వస్తుంన్నారు. మార్గ మధ్యలో చెన్నారం సమీపంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ ఎదురుగా వస్తున్న టీఎస్ 07 జీఆర్ 5868 నెంబర్ గల మహీంద్రా(కారు) వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles