క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Mon,June 17, 2019 10:11 PM

two people arrested in cricket betting case

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 53970 నగదును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధకిషన్‌రావు కథనం ప్రకారం.. దూల్‌పేట్, జంగూర్ బస్తీకి చెందిన విజేందర్ సింగ్, మహేష్ సింగ్‌లు గత మూడు నెలలుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించి దూల్‌పేట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ అడ్డాపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు బెట్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును దూల్‌పేట్ పోలీసులకు అప్పగించారు.

913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles