నాటుసారా స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

Tue,October 2, 2018 01:48 PM

two men arrested in saara case in warangal rural district

వరంగల్ రూరల్: నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గుబ్బేటితండా నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నాటు సారాను తరలిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు నిందితుల వద్ద నుంచి ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles