రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Sat,May 11, 2019 10:04 AM

Two killed in road accident

సూర్యపేట: జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. మృతులు మల్కాజ్‌గిరికి చెందిన లోకేశ్, కిరణ్‌కుమార్‌గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles