రైతుబంధు చెక్కులు అందుకున్న చిన్నారి బాలికలు

Wed,May 16, 2018 05:59 PM

Two girls received Rythu bandhu cheques in Narayanpur

క‌రీంన‌గ‌ర్: జిల్లాలోని గంగాధర మండలం నారాయణపూర్ లో నల్ల రజి(09), నల్ల స్రవంతి (07) అనే ఇద్దరు చిన్నారి బాలికలు రైతుబంధు కార్యక్రమంలో భాగంగా చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను అందుకున్నారు. ఎమ్మెల్యే బొడిగ శోభ వీరికి రైతుబంధు చెక్కులను అందజేశారు. బాలికల తల్లి నల్ల కమల రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె పేరుపై ఉన్న 20 గుంటల భూమిని పిల్లల పేరుపై విరాసత్ చేయడానికి రెండేళ్ల క్రితమే వారి తండ్రి భూంరెడ్డి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే భూంరెడ్డి సైతం రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో అయిదారు నెలల వరకు మంచానికే పరిమితమైనాడు. దీంతో విరాసత్ విషయం అధికారులు మరచిపోయారు. అయితే ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన వీరికి వరంలా మారింది. అధికారులు కమల పేరుపై ఉన్న 20 గుంటల భుమిని ఇద్దరు కూతుళ్ల పేరుపై విరాసత్ చేశారు. తండ్రిని గార్డియన్ గా పెట్టారు. నేడు బాలికలిద్దరూ రూ. 2 వేల చెక్కుతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు.

1817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS