శ్రీశైలం డ్యామ్ రెండు గేట్ల ఎత్తివేత

Thu,October 12, 2017 06:33 PM

Two flood gates of Srisailam dam lifted today

హైదరాబాద్: శ్రీశైలం డ్యామ్‌కు సంబంధించిన రెండు ఫ్లడ్ గేట్లను ఇవాళ ఎత్తివేశారు. ఆ గేట్ల ద్వారా సుమారు 56 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మరో 24 గంటల్లో నాగార్జునసాగర్‌కు భారీ స్థాయిలో నీరు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంకు 1,40818 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతున్నది. ఇవాళ ఉదయం డ్యామ్‌లో వాటర్ లెవల్ 884.5 ఫీట్లను టచ్ చేసింది. డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవల్ 885 టీఎంసీ. ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు పూజ చేసి గేట్లను ఎత్తివేశారు. త్వరలో మూడు స్పిల్ గేట్లను కూడా ఎత్తివేయనున్నట్లు శ్రీశైలం చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఆ గేట్ల ద్వారా సుమారు 84 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఇవాళ నెంబర్ 6,7 గేట్లను ఎత్తివేశారు.

3404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS