అనారోగ్యంతో ఇద్దరు రైతుల మృతి.. రైతు బీమా వర్తింపు

Sun,August 19, 2018 10:57 PM

two farmers who died with health issues claimed rythu beema in korutla

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అనారోగ్యంతో ఇద్దరు రైతులు ఆదివారం మృతి చెందారు. మోహన్‌రావుపేటకు చెందిన లక్కం మల్లయ్య యాదవ్ (45), గుమ్లాపూర్‌కు చెందిన తెడ్డు నర్సింలు (57) అనే రైతులు అనారోగ్యంతో చనిపోయారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా పథకంలో పాలసీదారులుగా చేరి బీమా బాండ్లను పొందారు. సమాచారం అందుకున్న సంబంధిత విభాగం అధికారులు మృతుల వివరాలను సేకరించారు. ఇద్దరు రైతులకు బీమా వర్తిస్తుందని, నామినీలకు త్వరగా బీమా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏఓ లావణ్య తెలిపారు. ఇప్పటికే అయిలాపూర్‌కు చెందిన మారుపాక రాజారెడ్డి అనే రైతు అనారోగ్యంతో మృతి చెందగా ఈ ముగ్గురి నామినీలకు రూ.5లక్షలు చొప్పున బీమా పరిహారం అందనుంది.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles