అడవుల్లో జంట మృతదేహాల కలకలం

Sun,June 16, 2019 07:10 PM

two dead bodies identified at vikarabad ananthagiri forest

వికారాబాద్: జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవుల్లో జంట మృతదేహాలు కలకలం రేపాయి. ఉదయం గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు హైదరాబాద్‌ బీహెచ్ఈఎల్ కు చెందిన దంపతులు నవరత్నరెడ్డి(80), స్నెహలతరెడ్డి(75)లుగా గుర్తించారు. ఈ నెల 12 కారులో కర్ణటకకు బయలుదేరినప్పటి నుంచి కనిపించడం లేదంటూ బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో భాగంగా మృతులు ప్రయాణించిన కారు డ్రైవర్‌ సతిష్ ను ప్రశ్నించగా తానే డబ్బుల కోసం తన స్నేహితుడు రాహుల్ తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితులపై అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

10002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles