రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, 10మందికి గాయాలు

Sun,October 21, 2018 10:51 PM

Two dead and 10 injured in road accident

కందుకూరు : రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో 10మంది వరకు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెద్దతుండ్ల తులేకాలన్ గ్రామానికి చెందిన పంబలి యాదయ్య కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం వద్ద వింధు ఏర్పాటు చేశాడు.అట్టి విందుకు ఆదివారం ఉదయం దార యాదయ్య, (50), మేడిపల్లి అంజయ్యలతో పాటు బందువులు, గ్రామస్తులు 20 మంది వరకు ఉదయం ట్రాక్టరుపై వెళ్లారు.అ

హైదరాబాద్‌లోని సైదాబాద్, జిల్లెలగూడ మలక్‌పేట్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వినోద్ కుమార్ (28), ఈశ్వర్‌కుమార్, శివకుమార్‌తో పాటు మరో ఇద్దరు ఇటిక టీఎస్ 11ఈ 9001 నంబరు గల కారులో మైసిగండి మైసమ్మ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండా హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై నేదునూరు గేటు సమీపంలోకి రాగానే వెనుక నుండి కారు ట్రాక్టరును ఢీ కోట్టడంతో కారు నడుపుతున్న కానిస్టేబుల్ వినోద్ కుమార్‌తో పాటు ట్రాక్టరులో ఉన్న దార యాదయ్యలు మృతి చెందారు.

విషయం తెలిసిన వెంటనే కందుకూరు పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన 10 మందిని 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతులను శవ పంచానామ నిమిత్తం ఉస్మానియ దవఖానకు తరలించారు. కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ ఈ జంగయ్య కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేశారు.

2464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles