చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా

Fri,July 12, 2019 04:56 PM

Two children died due to drowned in a pond


మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలాపురంలో ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఇద్దరు చిన్నారులు చిత్తానూరి సూర్యతేజ (8), విశాల్ తేజ(5) తిరుమలాపురంలోని మర్రికుంటలో ఈత కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు చిన్నారులిద్దరూ కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటయ్యాయి. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

356
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles