ఇద్దరు చైన్‌స్నాచర్లు అరెస్ట్

Mon,March 18, 2019 05:56 PM

Two chain snatchers arrested

హైదరాబాద్: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, రూ.3లక్షల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నిందితులు మెదక్ జిల్లాకు చెందిన అంజనేయులు, రవిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకున్నట్లు చెప్పారు. గత మూడు నెలలుగా 46 చోరీ కేసుల్లో 162 మందిని అరెస్టు చేశాం. పట్టుబడిన వారిలో మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని వెల్లడించారు.

1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles