గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

Sat,January 12, 2019 09:58 PM

Two arrested for marijuana transport

కరీంనగర్ : కరీంనగర్‌లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను కరీంనగర్ జిల్లా టాస్క్‌ఫోర్స్, కొత్తపల్లి మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద 250 గ్రాముల గంజాయి ప్యాకెట్ల రూపంలో లభ్యమైంది.

వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో మంచిర్యాల జిల్లాకు చెందిన భూక్య ప్రవీణ్ (23), ముత్యాల శ్రీకాంత్ (18) ఉన్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడనీ, అతనే ఈ ఇద్దరు నిందితులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శోభన్‌కుమార్, సీఐలు శ్రీనివాసరావు, జనార్దన్‌రెడ్డి, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ పాల్గొన్నారు.

570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles