కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు గడువు పొడిగింపు

Wed,December 30, 2015 11:50 AM

హైదరాబాద్ : రాష్ట్రంలో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియకు మరో రెండు నెలల గడువును హైకోర్టు పొడిగించింది. సెట్‌టాప్ బాక్సుల కొరత వల్ల గడువు పొడిగించాలని కోర్టును ఎంఎస్‌వోలు ఆశ్రయించారు. 85 శాతం ప్రజలకు సెట్‌టాప్ బాక్సులు కేంద్రం సరఫరా చేయలేదని ఎంఎస్‌వోలు పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎస్‌వోల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వారి అభ్యర్థనను అంగీకరించి డిజిటలైజేషన్‌కు రెండు నెలల గడువును పొడిగించింది.

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles