టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి

Tue,April 16, 2019 12:27 PM

TSRTC employees dies in Road accident in Krishna dist

హైదరాబాద్ : టీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు కృష్ణా జిల్లాలో ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ఒంగోలు నుంచి నిర్మల్‌కు బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడంతోనే బస్సు మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. క్రేన్ సాయంతో బస్సును పోలీసులు బయటకు తీశారు.

4306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles