టీఎస్‌ఆర్జేసీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

Wed,March 20, 2019 10:01 AM

TSRJC CET notification release and applications invites from eligible candidates

హైదరాబాద్ : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుచున్న 35 గురుకుల జూనియర్ కాలేజీలలో(టీఎస్‌ఆర్జేసీ) 2019-20 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ ఎన్. తారాసింగ్ తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులను(ఇంగ్లీష్ మీడియం) అభ్యసించాలని ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇతర వివరాల కోసం tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. లేదా 040-24734899, 8008904486, 9866559693 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles