28న రాష్ర్ట మంత్రివర్గ భేటీ

Tue,October 22, 2019 07:51 AM

హైదరాబాద్: రాష్ట్రంలో అడవుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 28న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానున్నది. ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని ఏవిధంగా పెంచాలి? భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ఎటువంటి విధానాలను అమలుచేయాలి? అనే అంశంపై క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చించనున్నదని అధికారవర్గాలు తెలిపాయి. అటవీ, పర్యావరణ, న్యాయశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొంటారు. సమావేశంలో అడవులశాతం అతితక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ రికగ్నిషన్ ఆప్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్వోఎఫ్‌ఆర్) కింద గిరిజనులకు, ఇతర అర్హులకు పట్టాలను అందజేసే విషయలో కూడా క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చించనున్నట్టు తెలిసింది.

571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles