టీఎస్ పాలిసెట్ 2019 ఫలితాలు విడుదల

Fri,April 26, 2019 11:36 AM

TS Polycet 2019 results announced

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ప్రతి యేటా నిర్వహిస్తారు. ఈసారి పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షను 1,03,591 మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించింది. ఏప్రిల్ 16, 2019 న ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఐఏఎస్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న ఎస్‌బీటీఈటీ ఆఫీసులో ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

పాలిసెట్ 2019లో సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 సాధించి మొదటి స్థానం పొందారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 120 మార్కులకు 119 మార్కులు సాధించి ఏడో, పదో స్థానం పొందారు. అభ్యర్థులు ఫలితాలను www.ntnews.com వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

2015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles