ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి నేటినుంచి దరఖాస్తులు

Fri,November 2, 2018 06:44 AM

TS PG AYUSH Admission 2018 Kaloji Narayana Rao University of Health Sciences

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయుష్ పీజీ వైద్యవిద్య సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డీ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఏఐఏపీజీఈటీ-2018లో అర్హత సాధించి కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ పరిధిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో చేరాలనుకొనేవారు శుక్రవారం నుంచి ఐదో తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles