గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలకు పోస్టులు మంజూరుThu,October 12, 2017 06:44 PM
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలకు పోస్టులు మంజూరు


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 22 గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలకు 1,445 పోస్టులను మంజూరు చేసింది. మొత్తం పోస్టుల్లో 880 లెక్చరర్ పోస్టులున్నాయి. పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్లు 88, ఆఫీస్ సబార్డినేట్ 88, స్టాఫ్ నర్స్ 44, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు 44, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 22, సూపరింటెండెంట్స్ 22, వార్డెన్స్ 22, స్టోర్ కీపర్స్ 22, కేర్ టేకర్స్ 22, సీనియర్ అసిస్టెంట్స్ 22 తోపాటు ఇతర పోస్టులున్నాయి.

3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS