వచ్చే డిసెంబర్ కల్లా 4 యూనిట్లు పూర్తి చేస్తాం..

Mon,March 25, 2019 08:50 PM

TS GENCO CMD Prabhakar Rao Inspects Bhadradri Thermal Power Station

మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు - పినపాక మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1080(270x 4)మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో సమష్టి కృషితో వచ్చే డిసెంబర్ కల్లా 4 యూనిట్లు పూర్తి చేస్తామని, తొలి యూనిట్‌లో బాయిలర్ లైటప్ విజయవంతమైందని జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లోని యూనిట్-1 బాయిలర్‌లో లైటప్‌ను ఆయన పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. రూ. 8500 కోట్ల పెట్టుబడితో విద్యుత్‌ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది డిసెంటర్ కల్లా పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 3వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు ఎం సశ్చితానందం, ఏ అజయ్, ఏ లక్ష్మయ్య, బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, కేటీపీఎస్ సీఈ సమ్మయ్య, బీహెచ్‌ఈఎల్ జనరల్ మేనేజర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles