జూలై 10 తర్వాత ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

Thu,June 20, 2019 06:50 AM

TS EDCET 2019 Counseling after July 10th

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదలలో జాప్యం అవుతున్నదని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 10నాటికి అన్ని వర్సిటీల్లో డిగ్రీ ఫలితాలు విడుదలచేసి, తర్వాత ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 204 కాలేజీల్లో 13,458 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని బీఈడీ కాలేజీలకు అఫిలియేషన్లు వచ్చాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టంచేశారు.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles