టీఎస్ సెట్ 2019 ఫలితాల విడుదల

Fri,August 23, 2019 10:02 PM

TS CET 2019 results released

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ - స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ - సెట్) 2019 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఓయూలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ మినీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత కల్పించేందుకు టీఎస్ సెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించేందుకు 2016 డిసెంబర్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మూడేళ్ల కాలానికి అనుమతి మంజూరు చేసిందన్నారు. దీని ప్రకారం టీఎస్ సెట్ 2019 పరీక్షను 29 సబ్జెక్టులకు గాను ఈ ఏడాది జూలై 5, 6 తేదీలలో నిర్వహించారని చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 44,649 మంది దరఖాస్తు చేసుకోగా, 32,284 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వారిలో మొత్తం 2,438 మంది అర్హత సాధించారని, అర్హత శాతం 7.55గా నమోదైందని పేర్కొన్నారు. వచ్చే నెలలో ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, అనంతరం టీఎస్ సెట్ అర్హత పత్రం జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ యాదవరాజు, ఓఎస్డీ ప్రొఫెసర్ కృష్ణారావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles