నకిలీ పత్రాలు సృష్టించి... ఇంటి విక్రయానికి యత్నం

Sun,April 21, 2019 07:18 AM

Try Home Selling Create Duplicate Documents

హైదరాబాద్ : నకిలీ పత్రాలు సృష్టించి... ఓ ఇంటిని విక్రయిం చేందుకు ప్రయత్నించిన ముఠాలోని ప్రధాన నిందితుడిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నకిలీ సబ్ రిజిస్ట్రార్ రబ్బరు స్టాంపులు, ల్యాప్‌టాప్, నకిలీ ఇంటి స్థలాల ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరి కొంతమంది నిందితు లు పరారీలో ఉన్నారు. ఎస్‌ఐ లింగారెడ్డి కథనం ప్రకారం ... మీర్‌పేటకు చెందిన ప్రేమ్‌కుమార్ రబ్బరు స్టాంపులు తయారు చేస్తుంటా డు. కాగా... మేడ్చల్‌కు చెందిన జునియా తన ఇంటిలో చాలా రోజు లుగా ఉండడంలేదు. దీన్ని గమనించిన ప్రేమ్‌కుమార్ ఆ ఇంటిని కాజేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ప్రేమ్‌కుమార్ మరి కొంత మందితో కలిసి ఆ ఇంటికి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు.

అనంతరం మేడ్చల్ ప్రాంతంలో ఉండే జగదీశ్‌కు రూ.32 లక్షలకు విక్రయించాడు. జగదీశ్ అడ్వాన్స్‌గా రూ.6లక్షలను ప్రేమ్‌కుమార్‌కు ఇచ్చాడు. అయితే ఈ డబ్బులను మేడ్చల్‌లో కాకుండా ఇసామియాబజార్‌లో తీసుకోవడంపై అనుమానం వచ్చింది.వెంటనే ప్రేమ్‌కుమార్‌ను ఇంటి యజమానిని కలవాలని చెప్పాడు. దీంతో ప్రేమ్‌కుమార్ కాలయాపన చేస్తూ ఉన్నాడు. దీంతో జగదీశ్ కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లగా... ఆ ఇంట్లో ఇంటి యజమాని జునియా చాలా రోజులుగా ఉండటం తెలిసింది. దీంతో మోసపోయాయని గ్రహించిన జగదీశ్ సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి... నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొంత మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles