హోదాపై ప్రకటన చేసిన తరువాతే రాహుల్ కాలుమోపాలి

Sat,August 11, 2018 08:07 PM

TRSV State Vice President Tunga Balu comments on Rahul gandhi telangana visiting

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాతే రాహుల్‌గాంధీ ఈ గడ్డపై కాలుమోపాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు ఆయనను క్షమించబోరని స్పష్టం చేశారు. రాహుల్ వైఖరికి నిరసనగా ఈ నెల 13న ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కై అధికారదాహంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రకటిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారి సంక్షేమ పథకాలు, నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోసారి రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ గడ్డపై అడుగు ఎలా పెడతావని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెడుతుంటే దానిని కాంగ్రెస్ నాయకులు భరించలేకపోతున్నారని విమర్శించారు.

5133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles