నేడు సిరిసల్లకు కేటీఆర్..

Sat,July 20, 2019 07:24 AM

TRS working President KTR visits Siricilla today

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పెంచిన పింఛన్లను జిల్లాకేంద్రంలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. పట్టణంలోని బీవై నగర్‌లోని మార్కె ట్ యార్డులో, ఒంటి గంటకు శాంతినగర్‌లో పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో పట్టణ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles