గట్టు భీముడి పార్థివదేహానికి కేటీఆర్‌ నివాళి

Thu,June 13, 2019 01:30 PM

TRS Working President KTR pay Tributes to Ex MLA Gattu Bheemudu dead body

జోగులాంబ గద్వాల : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి పార్థివదేహానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులర్పించారు. ఇవాళ ఉదయం గట్టు మండలం బలిగెరకు కేటీఆర్‌ చేరుకున్నారు. అనంతరం భీముడి పార్థివదేహానికి నివాళులర్పించి.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా భీముడి కుటుంబ సభ్యులకు కేటీఆర్ సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భీముడి అంత్యక్రియల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహాం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ సరిత, కలెక్టర్‌ శశాంక పాల్గొన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గట్టు భీముడు నిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1999 నుంచి 2004 వరకు గట్టు భీముడు గద్వాల ఎమ్మెల్యేగా పనిచేశారు. బీసీ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆయనకు భార్య భువనేశ్వరి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.


1860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles