బూత్ స్థాయి నుంచి టీఆర్‌ఎస్ బలోపేతం కావాలి : కేటీఆర్

Mon,June 24, 2019 01:54 PM

TRS working President KTR lays foundation stone to TRS Party Office

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలకు ఇవాళ భూమిపూజ జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతదని ఎవరూ ఊహించలేదు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి టీఆర్‌ఎస్ బలోపేతం కావాలి. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 32 జిల్లా పరిషత్‌లను గెలుచుకున్న ఘనత టీఆర్‌ఎస్‌ది.

ఈ నెల 27వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతామని కేటీఆర్ పేర్కొన్నారు. సభ్యత్వ నమోదును సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలి. జిల్లా కార్యాలయాల్లోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. దేశ, రాష్ట్ర రాజకీయాలపై టీఆర్‌ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉద్యమాన్ని, పరిపాలనను అద్భుతంగా నిర్వహించినందునే ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు ఉన్నారు. దేశం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వైపే చూస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నాం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు. దసరా నాటికి సిరిసిల్లకు సాగునీరు తీసుకువస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయింది. కాగా హైదరాబాద్, వరంగల్ రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాలకు స్థలాలను అన్వేషిస్తున్నారు. వనపర్తి జిల్లా కార్యాలయానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేశారు.

594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles