మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు : కేటీఆర్‌

Sat,March 30, 2019 02:55 PM

TRS Working President KTR fire on PM Modi Politics

ములుగు : మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదన్నారు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది, కానీ డబ్బులు జమ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉన్నది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటున్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles