ప్రతీ కార్యకర్త కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు..

Mon,May 27, 2019 04:23 PM

Trs workers work hard for kotha prabhakar teddy victory says harishraoసంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండోసారి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కొత్త ప్రభాకర్ రెడ్డికి సంగారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.

ఈ సభలో హరీశ్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తామన్నారు. మెదక్ నియోజకవర్గ ప్రజలు కొత్త ప్రభాకర్ రెడ్డికి పెద్దఎత్తున అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సేవకు అంకితమవుతాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ ప్రజలకు సాగునీరు ఇస్తాం. పింఛన్లు పెంచి ఇవ్వబోతున్నం. రైతు బంధు పెంచి రూ.5000 ఇస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. భువనగిరి స్థానంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఓడినట్టు అయింది..తక్కువ ఓట్లతో రోడ్ రోలర్ ఓట్లు వల్ల ఓడిపోయామని హరీశ్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు.

1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles