పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : కేటీఆర్‌

Tue,September 3, 2019 02:57 PM

trs WILL WIN municipality elections says KTR

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిధిలోని పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికల సమన్వయం కోసం బాధ్యులను సీఎం కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. స్థానికంగా పురపాలక ఎన్నికలు లేని ప్రజాప్రతినిధులు ఇతర ప్రదేశాల్లో బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతమైందన్నారు. బస్తీ డివిజన్‌ కమిటీల ఏర్పాటును ఈ నెల 6 నాటికి పూర్తి చేయాలని నాయకులకు కేటీఆర్‌ సూచించారు. ప్రతీ నియోజకవర్గంలోని బూత్‌కి ఒక సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ను నియమించాలి. సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లందరికీ పార్టీ తరపున శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles