టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకుంటుంది..

Thu,April 25, 2019 07:08 PM

trs will win 16 lokasabha seats says errabelli dayakarrao


మహబూబాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16స్థానాలు గెలుచుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రజలకు అవినీతి లేని వ్యవస్థ కోసం రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ శాఖలను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇనుగుర్తిని మండల కేంద్రం చేస్తామన్నారు. అదే విధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజ్, సాగునీరు హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఎస్సార్ఎస్పీ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా సాగునీరు అందిస్తాం. జూన్ నుంచి సంవత్సరంలో 10 నెలలు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

1938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles