HomeLATEST NEWSTrs will play important role in centre says Errabelli dayakarrao

కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతుంది.

Published: Thu,May 2, 2019 08:55 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

జనగామ : పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొడకండ్ల మండలంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల పరిధిలోని రేగుల, ఏడునూతుల, పాఖాల, రామవరం, చెరువుముందు తండ, లక్ష్మక్కపల్లి గ్రామాల్లో పర్యటించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్ఎస్ జోరుతో కాంగ్రెస్ బేజారవుతోందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం, తెలంగాణ ప్రజలకు వరమన్నారు. సాగు, త్రాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రజల కలలు సాకారం కాబోతున్నాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న అసరా పెన్షన్లతో వృద్దులకు భరోసా, గౌరవం పెరిగిందని పేర్కొన్నారు.

వరుస ఎన్నికలతో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని..మరో నెల రోజుల తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టబోతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని..నాలుగేళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. దేశంలోనే కేసీఆర్ పాలన ఆదర్శంగా నిలిచింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలో తీర్మాణం చేసి పంపినా..కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతుంది. గిరిజనుల కల నేరవేరబోతుంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పలు గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
2376
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology