టీఆర్ఎస్ క్లీన్ స్వీప్‌.. కేసీఆర్‌దే తెలంగాణ‌: ఇండియాటుడే రిపోర్ట్‌

Fri,December 7, 2018 06:44 PM

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో మ‌ళ్లీ కేసీఆరే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇండియా టుడే త‌న ఎగ్జిట్ పోల్ స‌ర్వే రిపోర్ట్‌ను విడుద‌ల చేసింది. ఆ రిపోర్ట్ ప్ర‌కారం టీఆర్ఎస్ పార్టీకి 79 నుంచి 91 సీట్లు ద‌క్క‌నున్నాయి. కేసీఆర్ చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలే ఆ పార్టీకి మ‌ళ్లీ అధికారాన్ని అందిస్తాయ‌ని ఇండియా టుడే స‌ర్వే పేర్కొన్న‌ది. ఆ స‌ర్వే ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 33 సీట్లు ద‌క్క‌నున్నాయి. ఇక బీజేపీకి 3 సీట్ల వ‌ర‌కు రావ‌చ్చు అని స‌ర్వే అంచ‌నా వేసింది. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు 46 శాతం ఓటు షేర్ ద‌క్కినట్లు స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ స్కీమ్‌లు ఓట‌ర్ల‌ను చాలా ఆక‌ర్షించాయ‌ని స‌ర్వే పేర్కొన్న‌ది. ముస్లిం, హిందూ ఓట‌ర్లు కేసీఆర్ వైపు మొగ్గు చూపార‌ని ఎడిట‌ర్ రాజ్‌దీప్ పేర్కొన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింద‌ని ఆ ఛాన‌ల్ అభిప్రాయ‌ప‌డింది. కేసీఆర్ త‌న అద్భుత‌మైన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లను ఓట్ల వైపు ఆక‌ర్షించార‌ని ఇండియా టుడే పేర్కొన్న‌ది.

7697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles