టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గ సమావేశం ప్రారంభం

Thu,June 27, 2019 03:18 PM

Trs state Executive Committee meeting started


హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందజేయనున్నారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles