బడ్జెట్‌పై టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ హర్షం

Fri,February 22, 2019 04:03 PM

TRS South African wing appreciate telangana Budget

హైదరాబాద్: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ హర్షం వ్యక్తం చేసింది. సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ... పుల్వామా అమరవీరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం పట్ల యావత్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అభినందిస్తుందన్నారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టి ఈ బడ్జెట్‌లో కనిపిస్తుందని కొనియాడారు. వృద్దాప్య పింఛన్‌కు కనీస వయస్సు తగ్గించడంతో సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమరంగానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసినందుకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles