సీఎం పుట్టిన రోజు వేడుకలు వినూత్నంగా జరిపిన ఎన్నారైలు

Mon,February 18, 2019 10:27 AM

trs south africa CM KCR birthday celebrations

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పిలుపు మేరకు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపలేదు. సౌతాఫ్రికలోని మూడు అతి పెద్ద సిటీస్‌లో బారీ చారిటీ డ్రైవ్ కార్యక్రమాన్ని, వైరా, ఖమ్మం జిల్లాలో అన్నధాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఖ‌మ్మం జిల్లా వైరాలో బాలవెలుగు అనాథ శరణాలయములో అన్నదాన కార్యక్రమం నిర్వ‌హించారు.

పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన భారతీయ సైనికుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటు కాన్సులేట్ జనరల్ మరియు భారత రాయభార కార్యాలయము వారు చేపట్టిన కార్యక్రమానికి టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అద్యక్షులు నాయకులు, టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కేప్టౌన్ సిటీలో టీఆర్ఎస్ నాయకులు బారీ సంఖ్యలో హాజరయ్యి వీరజవానులకి అశ్రునివాలులు అర్పించారు..

"డిగ్నిటీ కిట్స్ పర్ రేప్ విక్టింస్" పోలిస్ స్టేషన్‌కి వెళ్లేవారికి కావాల్సిన సత్వర అవసరమైన వస్తువులని అన్నింటిని కలిపి కిట్లని అన్నింటిని మిడ్రాండ్ జోహాన్నెస్బర్గ్ పోలీస్ స్టేషన్‌లో అందించారు.

లీమొగెట్స్వే సేఫ్టీ హోం లోని 105 మంది అనాథ పిల్లలకి రెండు నెలలకి సరిపడే వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు, ఆటవస్తువులు, పుస్తకాలు, బ్యాగ్ లు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వ‌హించారు. హెవెన్స్ నెస్ట్ అనాథ‌ శరణాలయములోని 15 మంది అనాథ పిల్లలకి 5 నెలలకి సరిపడే వంట సామాగ్రి, బట్టలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు అందజేసారు.. ఫినిక్స్ చైల్డ్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ వారికీ ఒక 3 నెలలకి సరిపడే వంట సామాగ్రి, బట్టలు మరియు ఇతర నిత్యావసర వస్తువులు అందజేసారు.
1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles