వనపర్తిలో నీళ్ల నిరంజన్ రెడ్డి గెలుపు

Tue,December 11, 2018 02:57 PM

TRS Singireddy Niranjan reddy wins from Wanaparthy

హైదరాబాద్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటమి పాలయ్యారు. 51,783 ఓట్ల మెజార్టీతో నిరంజన్ రెడ్డి గెలుపొందారు. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి నిరంజన్ రెడ్డికి 1,11,956 ఓట్లు రాగా, చిన్నారెడ్డికి 60,271 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ జెండాను చేతబట్టిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో చిన్నారెడ్డిపై ఓడిపోయారు. అయినా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఈ నాలుగేండ్లు నిరాడంబరంగా సేవలందించారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో నియోజకవర్గంలో సాగునీటి రంగంలో అద్భుతమే సాఇంచారు. తొలి ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేయడం, ఇతర అన్ని రంగాల అభివృద్ధిలో వనపర్తిని ఓ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో నిర్విరామంగా పని చేసుకొచ్చారు. ఇక వనపర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించడంతో ఆయనను సీఎం కేసీఆర్ నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిచిన సంగతి తెలిసిందే.

4103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles