టీఆర్ఎస్ ఖతర్ సెల్ ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

Wed,March 13, 2019 07:05 PM

TRS Qatar Cell Celebrates MP Kavitha Birthday


దోహా: నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజర్ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా..టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలో దోహాలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి ఎంపీ కవితకు శుబాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షుడు బందారపు శోభన్ గౌడ్ మాట్లాడుతూ..దేశ్ కా నేత, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 17లో 16 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవితకు దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పడకంటి, కోశాధికారి ప్రమోద్ కెథే, ఇండస్ట్రియల్ ఏరియా ఇంఛార్జి శంకర్ సుందరగిరి, యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట, ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధు మ్యాక, మొహమ్మద్ హుమాయున్, శంకరచారి బొప్పరపు, రాజి రెడ్డి సరసం, తేజా కుంభొజి, మహేశ్ వంగల, తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ, శెకర్ చిలువెరి, యెల్లయ్య తాళ్లపెళ్లి, శ్రీకాంత్ కొమ్ముల ఇతరులు పాల్గొన్నారు.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles