కొత్త మంత్రులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

Tue,February 19, 2019 01:20 PM

హైదరాబాద్‌ : మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తన సహచర ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులందరూ పని చేస్తారని విశ్వసిస్తున్నానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర మంత్రులుగా ఈటల రాజేందర్‌, జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రమాణస్వీకారం చేశారు.



2563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles