ఆసరా పింఛన్లకు కేంద్రం నయా పైసా ఇవ్వడం లేదు: కేటీఆర్

Sat,June 29, 2019 05:23 PM

TRS Party working president KTR launch party membership drive at sircilla

సిరిసిల్ల: సిరిసిల్లలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న మొక్కగా ఆరంభమైన టీఆర్‌ఎస్ ఈ రోజు అన్ని జిల్లా పరిషత్‌లు గెలిచే స్థాయికి ఎదిగింది. ప్రజల్లో విశ్వాసం నింపేందుకే జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నాం. సిరిసిల్లలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి నా వంతుగా నెల జీతం ఇస్తున్నా. దసరా లోపు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాం. కార్యాలయాలు పార్టీ కార్యక్రమాలకే కాకుండా శుభకార్యాలకు వాడుకునేలా చూస్తాం. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాల కోసం పుస్తకాలు పంపిణీ చేశాం. జులై 25వ తేదీ వరకు గడువ ఉన్నప్పటికి జులై 10వ తేదీ లోపు లక్ష్యం చేరుకోవాలని తెలిపారు.

సభ్యత్వంలో విధిగా ఆధార్ నెంబర్ కూడా ఉండాలి. ప్రతి సంవత్సరం బీమా కోసం రూ.15 కోట్లు చెల్లిస్తున్నందున ఆధార్ నెంబర్ లేకపోవడం సరికాదు. సభ్యులు విధిగా నామినీ పేరు, ఫోన్ నెంబరు కూడా ఇవ్వాలి. క్రీయాశీలక సభ్యులకు కార్డు ఇస్తాం. సభ్యత్వం తీసుకున్న అందరి ఫోన్ నెంబర్ల సమాచారం తీసుకోవాలి. ఫోన్ నెంబర్లు ఉంటే నేరుగా సమాచారం ఇవ్వడానికి వీలుంటుంది. జులై 20 లోపు బూత్ కమిటీలు, గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

జులైలో కమిటీల ఏర్పాటు తరువాత శిక్షణ ఇస్తాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తాం. పింఛను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే ఢిల్లీ నుంచి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆసరా పింఛన్లకు కేంద్రం నాయా పైసా ఇవ్వడం లేదు. కాళ్వేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే అప్పుల పాలు చేశారని ప్రచారం చేస్తున్నారు. మంచి భవిష్యత్‌కు పెట్టుబడి పెడుతున్నారనే ఆలోచన లేదు. మున్సిపల్ ఎన్నికల్లో పరిషత్ ఎన్నికల తరహా ఫలితాలు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

3539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles