భవిష్యత్ అంతా టీఆర్ఎస్ కార్యకర్తలదే..

Tue,March 26, 2019 07:04 PM

TRS party workers Would have Best Future


వరంగల్ అర్బన్ : వర్ధన్నపేట టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరని చూడటం లేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బంధుతో దేశానికి ఆదర్శం అయ్యిండన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన మనసున్న రైతు కేసీఆర్ అని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ అన్నారు.

గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్లు మన కోసం ఎదురు చూస్తున్నారు.ఐకమత్యంగా పని చేస్తే ఎన్నికలు ఏకపక్షమేనని, మెజారిటీ కోసం పోటీ పడదామనిఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుంది. ముఖ్యమంత్రి ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. అంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అంతా టీఆరెస్ కార్యకర్తలదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles