ఉద్యమంలో, పాలనలో టీఆర్‌ఎస్ విజయం: ఈటల

Thu,April 13, 2017 11:03 AM

TRS party won in movement and Government

వరంగల్: ఉద్యమాలను విజయవంతంగా నడిపించిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలోనూ సఫలమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల హామీల అమలు, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రి మాట్లాడుతూ.. ప్రజల విశ్వాస్వాన్ని పొందడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో ఉద్యమ పార్టీలు పాలనలో విఫలమయ్యాయన్నారు. కానీ తెలంగాణలో ఉద్యమాలను టీఆర్‌ఎస్ విజయవంతంగా నడిపింది. అదేవిధంగా పాలనలోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం సఫలమైందన్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. పాలనలో టీఆర్‌ఎస్ తీరు ఎలా ఉంటుందో అని సంశయించారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు.

దేశంలోనే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చింది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీయే అన్నారు. టీఆర్‌ఎస్ అమలుచేస్తున్న పథకాలు అన్ని రాష్ర్టాలను ఆకర్షిస్తున్నయని తెలిపారు. అణగారిన వర్గాల బాగుతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం జోరుగా కొనసాగిందన్న ఆయన ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నరని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు వరంగల్ బహిరంగ సభ అని వెల్లడించారు.

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles