నేడు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Fri,December 14, 2018 06:45 AM

TRS party State executive panel meet

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ ఇక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించడంతోపాటు వరుసగా రానున్న ఎన్నికలకు సిద్ధపడనుంది. ప్రధానంగా అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఆ తర్వాత సహకార, పార్లమెంటు, ఎంపీపీ తదితర ఎన్నికలు కూడా జరుగనున్నాయి. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే దిశానిర్దేశం చేయగా శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అందరికీ సూచనలివ్వనున్నారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే రాష్ట్ర కమిటీ సమావేశానికి కమిటీలోనివారందరినీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం, భవిష్యత్‌లో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

దీనితోపాటుగా రాబోయే మూడునెలల్లో పార్టీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణాలు పూర్తిచేయడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. దశాబ్దాల తరబడి కునారిల్లిన లంబాడి తండాలు, ఆదివాసీ గూడేలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలుగా మార్చింది. కొత్తగా 4383 పంచాయతీలను ఏర్పాటుచేసింది. 2551 తండాలు పంచాయతీలయ్యాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపొందించి అనేక విధులు, బాధ్యతలను చేర్చారు. ఈ నేథ్యంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేందుకు కృషిచేయాలని శుక్రవారం జరిగే సమావేశంలో పార్టీ కార్యవర్గానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

1936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles